![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -147లో... రామలక్ష్మి, సీతాకాంత్ లు జంటగా వస్తుంటారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందని, మీకు దిష్టి తగులుతుంది వెళ్లినపుడు వాళ్ళకి దిష్టి తీస్తూ ఉండమని శ్రీలతకి పెద్దాయన చెప్తాడు. సరే అని శ్రీలత అంటుంది. నువ్వు కూడ టిఫిన్ చెయ్ అని రామలక్ష్మితో సీతాకాంత్ అనగానే.. మీకు వడ్డీంచక చేస్తానని రామలక్ష్మి అంటుంది. చూసావా నీకు ఇష్టానికి అనుగుణంగా నడిచే భార్య దొరికిందని పెద్దాయన అంటాడు. ఈ అదృష్టం ఎప్పుడు నాతోనే ఉండాలని సీతాకాంత్ అనుకుంటాడు.
కాసేపటికి నువ్వు వెళ్ళే బారసాల పంక్షన్ కి రామలక్ష్మిని కూడా తీసుకొని వెళ్ళమని పెద్దాయన అంటాడు. తను వస్తుందో లేదోనని సీతాకాంత్ అంటాడు. నువ్వు తీసుకొని వెళ్తే వస్తుంది. మీరిద్దరు కలిసి వెళ్తున్నారంతే ఇది నా ఆర్డర్ అని పెద్దాయన అంటాడు. టిఫిన్ చేస్తూ.. సిరి, ధనలు ఎక్కడ అని సీతాకాంత్ అడుగుతాడు. ప్రొద్దున నుండి వాళ్ళు కిందకి రాలేదని శ్రీలత అంటుంది. మరొకవైపు సిరితో ధన కోపంగా మాట్లాడతాడు. నీకు నాకంటే మీ అన్నయ్య ముఖ్యం.. నాకు నచ్చిన బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే ఒప్పుకోవట్లేదని ధన అంటాడు. ఆ మాటలు సీతాకాంత్ వచ్చి వింటాడు. నీ సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదని సిరికి సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత ధన టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందామని సీతాకాంత్ అనగానే.. వద్దని ధన అంటాడు. ఇప్పుడేంటి నీకు నచ్చిన బిజినెస్ చేస్తానని అంటున్నవ్ అంతే కదా.. సరే నీకు నచ్చింది చెయ్ పెట్టుబడి పెడతానని సీతాకాంత్ అనగానే.. సిరి, ధనలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
మీరేం చేయట్లేదని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. అప్పుడే సీతాకాంత్, రామలక్ష్మిలు ఫంక్షన్ కి రెడీ అయి వస్తుంటారు. నా దిష్టి తగిలేలా ఉందని రామలక్ష్మికి దిష్టి చుక్కపెడుతుంది శ్రీలత. వాళ్ళు వెళ్తుంటే శ్రీలత కళ్ళు తిరిగి పడిపోయినట్లు యాక్ట్ చేస్తుంది. దాంతో ఇద్దరు వెనక్కి వస్తారు. ఏమైందని సీతాకాంత్ అంటాడు. టాబ్లెట్ వేసుకోలేదని శ్రీలత అనగానే.. చూసుకోవాలి కదమ్మా.. అమ్మకి టాబ్లెట్స్ ఇవ్వాలి కదా అని శ్రీవల్లిపై సీతాకాంత్ కోప్పడగా.. ఆ డ్యూటీ రామలక్ష్మిది.. మీతో బయటకు వెళ్ళే హడావిడిలో ఇవ్వడం మర్చిపోయిందని శ్రీవల్లి అనగానే.. రామలక్ష్మిపై సీతాకాంత్ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |